Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:41:28
facebook Twitter Googleplus
Photo

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తాజా చిత్రం అఆ .ఈ ఫిలిం ఫలితం కోసం హీరో - దర్శకుడు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే.అయితే అఆ కోసం ఆ ఇద్దరికంటే ఇంకా ఎక్కువగా ఆలోచిస్తోన్న వాళ్లలో టాలీవుడ్ కుర్రహీరోలు చాలామంది ఉన్నారు.ఈ సినిమా హిట్ నితిన్ కు ఎలాంటి స్టార్ డమ్ ను తీసుకువస్తుందో తమకు తెలియదుగాని... తమకు మంచి దారి చూపెడుతుందని అటు కుర్రహీరోలతో పాటు పరిశ్రమ కూడా ఎదురు చూస్తుంది.కెరియర్ స్టార్టింగ్లో ఫస్ట్ ఫిలింకు మాత్రమే తరుణ్ లాంటి బిగ్రేడ్ హీరోని తీసుకున్న త్రివిక్రమ్... ఆ తరువాత ఆల్మోస్ట్ ఏగ్రేడ్ హీరోలతోనే సినిమాలు చేశాడు.దీంతో త్రివిక్రమ్ తో చేస్తే కెరియర్ టర్న్ అవుతుందని ఆశ పడ్డ అప్ కమింగ్ హీరోలందరికి త్రివిక్రమ్ మొండి చేయి చూపించినట్లయింది.స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ... సేఫ్ గేమ్ కు త్రివిక్రమ్ భాగా అలవాటు పడిపోయాడు.

త్రివిక్రమ్ ను ఇదే విషయంలో సన్నాఫ్ సత్యమూర్తి ఫలితం తర్వాత కొందరు కామెంట్స్ చేశారు.ఎప్పుడూ సేఫ్ గేమానా...రిస్క్ చేసే ధైర్యం లేదా అని రెచ్చగొట్టేసరికి.. పౌరుషానికి పోయి నితిన్ తో సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేశాడంటారు.ఇప్పుడీ సినిమా రిజల్ట్ పాజిటివ్ గా వచ్చి...కలెక్షన్లు కూడా 50కోట్లకు దగ్గరిగా వస్తే మాత్రం...త్రివిక్రమ్ ను చాలామంది గట్స్ ఉన్న దర్శకుడిగా ట్రీట్ చేయెచ్చు.ఎట్ ది సేమ్ టైమ్ మంచు మనోజ్ - నాని లాంటి హీరోలు త్రివిక్రమ్ తో సినిమా కోసం ఆశపడొచ్చు.కాని నితిన్ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ తనకు నచ్చిన స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే విధంగా ప్లాన్లు చేస్తున్నాడని తెలుస్తోంది.ఇపుడిదే పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

,  ,  ,  ,  ,  ,  ,