తాను పవన్ కల్యాణ్ అభిమానినని యంగ్ హీరో నితిన్ బాహాటంగా చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి అభిమాని ఇప్పుడు తన చిత్రాన్ని మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో సినిమాపై వదులుతున్నాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద' చిత్రాన్ని ఈ నెలలో క్రిస్మస్ రోజున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. సరిగ్గా అదే రోజున నితిన్ నటించిన 'చిన్నదాన నీ కోసం' చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడేలా వున్నాయి. అయితే, ఇలా విడుదలవడం వల్ల ఎక్కువ నష్టం నితిన్ కేనని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. వరుణ్ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో కావడంతో అతని చిత్రానికి విపరీతమైన ఓపెనింగ్స్ ఉంటాయనడంలో సందేహం లేదు. దీని కారణంగా నితిన్ సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది.
nithin, ChinnadanaNeekosamstills, akarunakarun, newmovie, mukunda,