Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2016 10:26:05
facebook Twitter Googleplus
Photo

అ.. ఆ.. సినిమాతో యంగ్ హీరో నితిన్ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. స్టార్ హీరోలకు సైతం కష్టతరమైన 50 కోట్ల క్లబ్ లోకి నితిన్ ఈ సినిమాతో అవలీలగా చేరిపోయి స్టార్ హీరో స్టేటస్ ని దక్కించుకున్నాడు. ఒకరకంగా నితిన్ సినీ కెరీర్లో త్రివిక్రమ్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ సినిమానే అతిపెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద హిట్ తరువాత కూడా నితిన్ ఇప్పటి వరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో అనౌన్స్ చెయ్యలేదు.
అందుకు కారణం నితిన్ సక్సెస్ వేవ్ ని కొనసాగించడానికి తరువాత చేయబోయే కథ అ.. ఆ.. ను మించిన హిట్ కథ అయ్యుండాలని చూస్తున్నాడని తెలుస్తోంది. అందుకే టాప్ డైరెక్టర్ల దగ్గర్నుండి చిన్న దర్శకుల వరకూ అందరి కథలనూ వరుసగా వింటున్నాడట. పైగా తన కొత్త సినిమా బడ్జెట్ కూడా దాదాపు 30 కోట్లు ఉండేలా కూడా ప్లాన్ చేస్తున్నాడట.

,  ,  ,  ,  ,  ,  ,