Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jul-2017 10:46:25
facebook Twitter Googleplus
Photo

ఆ సూపర్ స్టార్ కు ఆప్తమిత్రుడైన ఓ స్టార్ డైరెక్టర్.. వీళ్లిద్దరూ కలిసి ఓ మీడియం రేంజి హీరోతో సినిమా నిర్మించడం అరుదైన విషయం. టాలీవుడ్లో అలాంటి అరుదైన కాంబినేషన్లో సినిమాకు రంగం సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంయుక్త నిర్మాణంలో యువ కథానాయకుడు నితిన్-లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య కాంబినేసన్లో చాన్నాళ్ల కిందటే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదికి వెళ్లింది. సోమవారమే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభించుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు.

50 రోజుల పాటు హైదరాబాద్ లో నిర్విరామంగా ఈ చిత్రం షూటింగ్ జరగబోతోంది. తర్వాత మరో లాంగ్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లబోతోంది. నితిన్ ఈ మధ్యే లై సినిమాను పూర్తి చేసి ఫ్రీ అయ్యాడు. దర్శకుడిగా తొలి సినిమా రౌడీ ఫెలో తో మంచి పేరు సంపాదించిన కృష్ణచైతన్య.. రెండో సినిమా కోసం చాలా కాలమే ఎదురు చూశాడు. నితిన్ తోనే సినిమా తీయాలని ఫిక్సయి.. అతను ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేశాడు. ఈ కాంబినేషనే జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథకుడు కూడా కావడం వివేషం.

,  ,  ,  ,  ,  ,