Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2016 12:09:02
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన ?కబాలి? సినిమా భారీ అంచనాల నడుమ మరో మూడు రోజుల్లో థియేటర్లలో వాలిపోనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తోన్న అభిమానులంతా ప్రస్తుతం సంబర వాతావరణంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్నిచోట్లా ఈ సినిమాకు టికెట్స్ దొరకడమనేదే గగనమైపోయింది. రజనీ కాంత్‌ని ఓ దేవుడిగా కొలిచే ఆయన అభిమానుల కోసం తమిళనాట గురువారం అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ మొదలుకానుండగా, తెలుగులో మాత్రం శుక్రవారం రోజునే మొదటి షో ప్రదర్శితం కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఒక్క నైజాంలోనే సుమారు 300లకు పైనే థియేటర్లలో విడుదల కానుంది. ఇక నైజాంలో ఈ సినిమాను విడుదల చేస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో లాంటివేవీ పెట్టడం లేదని, శుక్రవారం రోజునే అన్నిచోట్లా మొదటి షో ఉంటుందని స్పష్టం చేసింది. తమిళంలో రియలిస్టిక్ దర్శకుడిగా మంచి పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాకు కళైపులి థాను నిర్మాత.

,  ,  ,  ,  ,  ,  ,