Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 10:05:28
facebook Twitter Googleplus
Photo

ది బెస్ట్ అనదగ్గ మూవీస్ లో ఒకటిగా గుర్తింపు పొందిన చిత్రం రుద్రమదేవి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయినా.. దర్శకుడు గుణశేఖర్ తనే నిర్మాతగా వ్యవహరిస్తూ.. భారీ బడ్జెట్ తో రూపొందించి.. చివరకు సేఫ్ అయ్యాడు. కానీ రీసెంట్ గా ప్రకటించిన నంది అవార్డులను పరిశీలిస్తే.. అసలు రుద్రమదేవిని పట్టించుకున్నట్లుగా కూడా అనిపించదు.

అదే ఏడాది బాహుబలి ది బిగినింగ్ విడుదల కావడంతో.. ఉత్తమ చిత్రం అవార్డు ఆ మూవీకి ఇచ్చారు. మిగిలిన అవార్డులను శ్రీమంతుడు.. ఎవడే సుబ్రమణ్యం.. నేను శైలజ వంటి చిత్రాలు ఎగరేసుకు పోయాయి. ఉత్తమ నటి అవార్డును రుద్రమదేవిగా నటించిన అనుష్కకే ఇచ్చినా.. రుద్రమదేవి చిత్రానికి కాకుండా సైజ్ జీరో మూవీకి ఇచ్చారు. ఇక గోన గన్నారెడ్డిగా మెప్పించిన అల్లు అర్జున్ కు ఉత్తమ సహాయ నటుడు కాకుండా.. ఉత్తమ కేరక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ ప్రకటించడం ఆశ్చర్యకరం. అయితే.. ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందంటూ సోషల్ మీడియాలో జనాలు ఎద్దేవా చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను రాయితీ ఇచ్చి..తమ సినిమాకు ఇవ్వకపోవడాన్ని గుణశేఖర్ బాహాటంగా తప్పుపట్టడం ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేయడానికి కారణం అని.. అందుకే గుణశేఖర్ ను ఇలా టార్గెట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరో సందర్భంలో బాలయ్య చేతుల మీదుగా అవార్డు తీసుకున్న గుణశేఖర్.. ఆయనను పట్టించుకోనట్లు ప్రవర్తించడం కూడా ఓ రీజన్ కావొచ్చని కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.

,  ,  ,  ,  ,  ,