Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 15:37:43
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి మహాభారతం సంగతి. ఎప్పటికైనా మహాభారతం సినిమా తీస్తానని.. కానీ అందుకు ఇంకా పదేళ్ల దాకా సమయం పడుతుందని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తూనే ఉన్నాడు రాజమౌళి. కానీ దీనికి సంబంధించిన ప్రశ్నల్ని మాత్రం మీడియా వాళ్లు వదలట్లేదు. రాజమౌళి కనిపించినా.. విజయేంద్ర ప్రసాద్ కనిపించినా.. మహాభారతం ప్రస్తావనే తెస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా దీనికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. జై లవకుశ ప్రమోషన్ల కోసం మీడియాను కలిస్తే.. మీ మిత్రుడు రాజమౌళి మహాభారతం తీస్తారట కదా.. అందులో మీకు కీలక పాత్ర ఇస్తున్నారట కదా అని అడిగారు.

దానికి ఎన్టీఆర్ నవ్వుతూ బదులిచ్చాడు. రాజమౌళి అడిగితే ఏ సినిమా అయినా సరే.. మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటా. మహాభారతం లో అవకాశమిచ్చినా కూడా ఎందుకు నటించను. కానీ ఈ సినిమా గురించి ఆయన్నే అడగాలి. ఆయనే స్పష్టత ఇవ్వాలి. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం.. ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాదు అని ఎన్టీఆర్ క్లియర్ గా చెప్పేశాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను చేయబోయే కొత్త సినిమా గురించి కూడా ఎన్టీఆర్ కొంత స్పష్టత ఇచ్చాడు. ఈ సినిమా కోసం మలేషియాకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోబోతున్నట్లుగా వచ్చిన వార్తల్ని అతను ఖండించాడు. అలాంటిదేమీ లేదన్నాడు. అలాగే డీటాక్సిఫికేషన్ చేయించుకోనున్నట్లు వచ్చిన రూమర్ల మీదా స్పందించాడు. డీటాక్సిఫికేషన్ తప్పేమీ కాదని.. ఐతే తాను అలా ఏమీ చేయించుకోవట్లేదని అన్నాడు. త్రివిక్రమ్ సినిమా కోసం ఒక లుక్ అనుకుంటున్నామని.. ఆయనతో చర్చించి ఫైనలైజ్ చేశాక దాని కోసం తయారవుతానని చెప్పాడు ఎన్టీఆర్.

,  ,  ,  ,  ,