Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 10:21:30
facebook Twitter Googleplus
Photo

పెద్ద సినిమాలకు ఇవి పెద్ద బెడదగా మారిపోయాయి. తాజాగా ఈ దెబ్బ మరో క్రేజీ ప్రాజెక్టును తాకింది. జై లవకుశకు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు టీజర్ కూడా లీక్ చేసేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి.. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన లింకుల్ని ఏరివేసే ప్రయత్నం జరుగుతోంది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

జై లవకుశ టీజర్ రఫ్ కట్ వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చేసింది. జనాలు విరగబడి చూసేస్తున్నారు. అదేమంత క్లారిటీతో లేదంటున్నారు. ఒరిజినల్ టీజర్ చూసిన ఫీలింగ్ ఇవ్వట్లేదంటున్నారు. అలాగని ఒరిజినల్ టీజర్ రిలీజైనపుడు ఎగ్జైట్మెంట్ ఉంటుందా అంటే అదీ సందేహమే. ఆల్రెడీ మసక మసకగా అయినా విజువల్స్ చూసేశారు కాబట్టి.. టీజర్ రిలీజైనపుడు ఆసక్తి ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడేం చేద్దామా అని జై లవకుశ టీం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముందు అనుకున్న ప్రకారం జులై 5న టీజర్ రిలీజ్ చేద్దామా.. లేక ఎలాగూ టీజర్ లీక్ అయిపోయింది కాబట్టి వెంటనే దాన్ని మార్కెట్లోకి వదిలేద్దామా అని యోచిస్తున్నారట. లేదంటే ఇప్పటికే షూట్ చేసిన వాటిలోంచి వేరే షాట్లు ఎంచుకుని.. లీక్ అయిన టీజర్లోని ఒకట్రెండు షాట్లు కలిపి కొత్త టీజర్ రెడీ చేద్దామా అని కూడా చర్చలు జరుగుతున్నాయట.

టీజర్ ఇప్పుడున్నట్లే రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా పని కానిచ్చేస్తారట. జులై 5నే అనుకుంటే మాత్రం కొత్త షాట్లతో టీజర్ ను భిన్నంగా తయారు చేస్తారట. ఇంకా వారం రోజులు టైం ఉంటుంది కాబట్టి మార్పులు చేర్పులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

,  ,  ,  ,  ,  ,