Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2016 10:12:11
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సెన్సార్‌కు వెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ అందించింది. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 40 నిముషాలు ఉన్నట్లు సమాచారం.

కొరటాల శివ, తారక్ల క్రేజీ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథను అద్భుతంగా తెరకెక్కించిన కొరటాల శివ.. తారక్ అభిమానులకు ఐ ఫీస్ట్ ఇవ్వనున్నారని టాక్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది.

,  ,  ,  ,  ,