Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 16:22:23
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ హిట్ తర్వాత కాస్తంత విరామం తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలు స్పీడప్ చేస్తున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో జనతా గ్యారేజ్ విడుదలైంది. ఈ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టినా కాస్త గ్యాప్ తీసుకుని బాబీ డైరెక్షన్ లో జై లవకుశ సినిమా ఓకే చేశాడు. ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ తో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. జెంటిల్ మేన్ ఫేం. నివేదా థామస్ రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజైంది. జైలవకుశ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిలిం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యేది రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పవన్ సిినిమాకు సంబంధించిన పని పూర్తవగానే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన వర్క్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ హీరోగా అ..ఆ సినిమా నిర్మించిన ఎస్. రాధాకృష్ణనే ఎన్టీఆర్ తో సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు.

తొలిసారి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా స్పెషల్ గా ఉండాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడని అందుకోసమే ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ ను బాలీవుడ్ నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నారని టాక్.

,  ,  ,  ,  ,