Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 11:17:58
facebook Twitter Googleplus
Photo

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తన స్థాయి విజయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సాధించేశాడు. టెంపర్ నుంచి మొదలుపెట్టి వరుసగా హిట్స్ కొట్టడమే కాదు.. ప్రతీ సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వెళ్లడం.. కెరీర్ బెస్ట్ లు.. ఇండస్ట్రీ రికార్డులు కొట్టడం టార్గెట్స్ ని రీచ్ అయిపోయాడు. చాలా ఏరియాల్లో ఇప్పుడు నాన్ బాహుబలి రికార్డులు జనతా గ్యారేజ్ ఖాతాలోకి వచ్చేశాయి. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి కూడా సెకండ్ ప్లేస్ నిలబడ్డం అంత కష్టం కాకపోవచ్చనే అంచనాలున్నాయి.

మరి ఇంతటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఏంటి? వక్కంతం వంశీతో సినిమా ఫైనల్ కాలేదని జూనియర్ స్వయంగా చెప్పాడు కాబట్టి.. అది పక్కన పెట్టేసినట్లే. ఇజం టీజర్ తో అందరి దృష్టినీ తన మీదకు మళ్లేలా చేయడంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ - పూరీ కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం మొదలైపోయింది. అది కూడా వక్కంతం వంశీ అందించే స్టోరీనే అని టాక్ రావడం విశేషం. అయితే.. ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి మాత్రం నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏదీ ఫైనల్ కాలేదనే మాట వినిపిస్తోంది.

అయితే పూరీ టీం మాత్రం ఎన్టీఆర్ కి ఫైనల్ స్క్రీన్ ప్లే వినిపించామని.. యంగ్ టైగర్ ఓకే అనేశాడనే టాక్ వస్తోంది. అయితే.. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి.. ఎన్టీఆర్-పూరీ ప్రాజెక్ట్ ఇంకా ఖాయం కానట్లే.

,  ,  ,  ,  ,  ,