Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2015 11:24:50
facebook Twitter Googleplus
Photo

టెంపర్ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో .. అంతకి మించిన హిట్ ని అభిమానులకి అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. కొత్తలుక్ తో .. కొత్త స్టైల్ తో .. కొత్త కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించే ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్. ఇది పూర్తి కుటుంబ కథా చిత్రమనీ, అనుబంధాల నేపథ్యంలో చక్కటి ఫీల్ తో కొనసాగుతుందనే విషయాన్ని పరిశీలనలో వున్న 'నాన్నకి ప్రేమతో' అనే టైటిలే చెబుతోంది.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎక్కువ భాగం షూటింగ్ 'యునైటెడ్ కింగ్ డమ్'లో జరుగుతుంది. ఇప్పటికే అక్కడి లొకేషన్లను ఫైనలైజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. కొత్తదనం కోసం సుకుమార్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తోన్న ఈ ప్రయోగం సక్సెస్ కావాలనే కోరుకుందాం.

,  ,  ,  ,  ,  ,  ,  ,