Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jun-2016 12:22:22
facebook Twitter Googleplus
Photo

దాదాపుగా ప్రతీ శుక్రవారం సినిమా పండగ ఉంటుందనే విషయం ప్రేక్షకులకు తెలుసు. కొన్ని కొత్త సినిమాలు రేస్ లోకి వచ్చేసి అప్పటికే థియేటర్లలో ఉండే సినిమాకు టెండర్ పెడుతూ ఉంటాయి. కొత్త సినిమాకు టాక్ బాగుండే.. పాతదానికి వసూళ్లు పడిపోతూ ఉంటాయి. గత వారం విడుదలైన నితిన్-సమంతల మూవీ అ..ఆ..ను ఓ రెండు సినిమాలు ఇలాగే బెదిరించాయి.

ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే అనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన రైట్ రైట్.. సందీప్ కిషన్-నిత్యామీనన్ లు జంటగా వచ్చిన థ్రిల్లర్ మూవీ ఒక అమ్మాయి తప్ప.. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు ఆసక్తి కలిగించిన మాట వాస్తవమే. అయితే.. రైట్ రైట్ చిత్రాన్ని ఎవరూ రైట్ అనలేకపోగా.. సందీప్ సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఎవరినీ థ్రిల్ చేయలేకపోయాయి.

దీంతో మళ్లీ జనాలకు అ..ఆ.. ఒకటే ఆప్షన్ గా మిగిలింది. మరోవారం పాటు థియేటర్లను దున్నేసేందుకు త్రివిక్రమ్ సినిమాకు అవకాశం లభించింది. ఇది కాకుండా థియేటర్లలో ఇంకా సత్తా చాటుతున్న సుప్రీమ్ - సరైనోడు సినిమాలు కూడా వసూళ్లను రాబట్టుకునేందుకు ఛాన్స్ వచ్చింది. వచ్చేవారం వచ్చే నాని జెంటిల్మన్ వరకూ.. ఇదే పరిస్థితి. అప్పటి సంగతి అప్పుడు మాట్లాడుకుందాం.

,  ,  ,  ,  ,  ,  ,