Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2015 16:46:01
facebook Twitter Googleplus
Photo

అబ్బాయితో అమ్మాయి అని ఓ టాలీవుడ్ మూవీ వస్తోంది. నాగశౌర్య - పాలక్ లల్వాని అనే ముంబై ఇంపోర్టెడ్ భామ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ దగ్గర నుంచీ ఈ అమ్మాయి - అబ్బాయిలు బజ్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి అన్ని పోస్టర్ లిప్ కిస్ ల పైనే ఉండడమే దీనిక కారణం.

రీసెంట్ గా ఈ మూవీకి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. లుక్ తోనే మంచి గ్రేస్ ఉంది అంటూ మంచి మార్కులు కొట్టేసింది. దీనికి తగ్గట్టుగానే ఆడియో ఫంక్షన్ కి అమ్మాయి డ్రెసింగ్ కూడా ఉండడం విశేషం. ఒకవైపు అందంగా కనిపిస్తూనే మరోవైపు హద్దులు దాటకుండా వచ్చింది పాలక్. దీనికి తోడు లిప్ లాక్ లకు సై అన్నపుడే టాలీవుడ్ నిర్మాతల దృష్టి ఈ చిన్నదానిపై పడింది. ఈ పిల్ల పెట్టిన పెదవి ముద్దులు ఎంతగా పాపులర్ అయ్యాయంటే.. అమ్మాయితో అబ్బాయి మూవీకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నా.. ఆ సంగతిని చాలామంది పట్టించుకోనంతగా.

ఇక ఈ ముంబై బేబీ టాలీవుడ్ లో ఏ మాత్రం సత్తా చాటగలదు అన్నదే అసలు ప్రశ్న. రీసెంట్ గా సాయేషా సైగల్ కూడా అఖిల్ తో ఎంట్రీ ఇచ్చింది కానీ.. ఆ మూవీ ఇచ్చిన షాక్ దెబ్బకు మళ్లీ ఆఫర్స్ రావడం కష్టం. లోఫర్ తో దిశాపటానీ కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరి వీరిలో తెలుగు ప్రేక్షకులను ఓ నాలుగేళ్లపాటు అలరించగలిగే సత్తా ఎవరికి ఉందో తెలియాలంటే.. వీటి రిలీజ్ ల వరకూ ఆగాల్సిందే.

,  ,  ,  ,