Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2017 10:29:05
facebook Twitter Googleplus
Photo

డీజే - దువ్వాడ జగన్నాధం.. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ ప్రకటించడమే సెన్సేషన్. మూవీకి సంబంధించిన అప్ డేట్స్ అన్నీ వైరల్ గా స్ప్రెడ్ అయ్యాయ్ కానీ.. అసలు విషయం ఏంటనే సంగతి.. డీజే టీజర్ రిలీజ్ అయినపుడే తెలిసింది.

సరైనోడు సక్సెస్ మీట్ లో 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ చేసిన కామెంట్స్ కు.. డీజే టీజర్ కు డిజ్ లైక్స్ రూపంలో రిటార్ట్ ఇచ్చారు పవన్ ఫ్యాన్స్. ఆ మధ్య సినిమా సాంగ్స్ కి సిద్ధం కావాలంటూ.. హరీష్ శంకర్ ఓ ట్వీట్ పెడితే.. మేం డిజ్ లైక్స్ కి రెడీ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ సాక్షిగానే చెప్పారు. ఇప్పుడు ఆడియో టీజర్ ను రిలీజ్ చేసింది డీజే టీం. చిన్న మ్యూజిక్ బిట్ మాత్రమే కావడంతో.. ఇప్పటివరకూ 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఆడియో టీజర్ కు ఇప్పటి వరకూ 17 వేల లైక్స్ రాగా.. డిజ్ లైక్స్ ఇప్పటికే 11వేలు దాటిపోయాయి.

అంటే పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొడుతున్న విషయం తెలిసిపోతోంది. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా చెప్పను బ్రదర్ ను ఏ మాత్రం మరచిపోలేదని అర్దమవుతుంది.

,  ,  ,  ,  ,  ,