Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 11:06:23
facebook Twitter Googleplus
Photo

వరుసపెట్టి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్నట్టుండి అవకాశాలు కరువయ్యాయిస్నేహితురాలు సమంతా సాయంతో నితిన్ ని హీరోగా ఒప్పించి అ.. ఆ.. లాంటి సినిమా తీసినా త్రివిక్రమ్ ప్రస్తుతం ఖాళీగానే వున్నాడు.

అయితే పవన్ తో తన తదుపరి సినిమా వుంటుందని ఇండస్ట్రీలో వార్తలు ఘాటుగా వినిపిస్తూనే వున్నాయి. అయితే జనసేన పనుల్లో మునిగిపోయిన పవన్ చేతిలో వున్న కాటమరాయుడే ప్రకటించిన చాలా రోజులకు మొదలయ్యింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పవన్ ల సినిమా ప్రకటన ఎప్పుడు - సెట్స్ మీదకు వెళ్లేదెప్పుడూ అన్న సందేహం రాకపోదు. అయితే ఈ క్లాష్ ని ఎదుర్కొనేందుకు పవన్ త్రివిక్రమ్ కి ఫ్రెండ్లీ సాయం ఒకటి చేయనున్నాడు.

నవంబర్ లో పవన్ వి 15 రోజుల డేట్ లు త్రివిక్రమ్ కి ఇచ్చినట్టు సమాచారం. తన కాంబినేషన్ లో వచ్చే సీన్లన్నీ ముందు తీసేయమని తరువాత మిగిలిన షాట్స్ తీయమని తనకి కుదిరినప్పుడు మిగిలిన డేట్స్ ఇస్తానని మాటిచ్చాడట. విన్ విన్ సిట్యువేషన్ కాబట్టి త్రివిక్రమ్ కూడా ఒకే చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అనిరుద్ తో కలిసి పనిచేస్తున్నట్టు సమాచారం.

,  ,  ,  ,  ,