Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2016 13:07:12
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ రంగంలోకి దిగనున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం రేపటి (ఆగస్టు 6) నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ష్యాక్షన్ నేపథ్యంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ.. ఇందులో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్ కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. సినిమా రెగ్యూలర్ షూటింగ్ రేపటి నుంచే ప్రారంభమైన పవన్ మాత్రం ఓ వారం వారం రోజుల తర్వాత షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.

ఏవిధంగా చుసిన ఈ న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే న్యూసే. కానీ.. పవన్ ఫ్యాన్స్ దిగాలు చెందుతున్నారు. పవన్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న విషయంలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కానీ? పవన్ వారం రోజుల తర్వాతనే షూటింగ్ లో పాల్గొననుండటం ఫ్యాన్స్ ని కలవర పెడుతోంది.

ఎందుకంటే.. సర్థార్ ? గబ్బర్ సింగ్ విషయంలోనూ ఇదే జరిగింది. పవన్ లేకుండానే సర్థార్ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. కరెక్ట్ గా సినిమా సెట్స్ పైకి వెళ్లిన ఓ వారం తర్వాత పవన్ షూటింగ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ గా సర్థార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర అనుకొన్న రేంజ్ లో రాణించలేకపోయాడు.

ఇప్పుడు పవన్ తాజా చిత్రం విషయంలోనూ పవన్ షూటింగ్ మొదలైన ఓ వారం తర్వాత జాయిన్ అవ్వనుండటంతో.. ఆయన ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మళ్లీ సర్థార్ రిజల్ట్ రిపీట్ అవుద్దేమోనని భయపడిపోతున్నారు. పవన్ సెంటిమెంట్స్ ఎలావున్నా.. మరి, ఈసారైనా పవన్ హిట్ కొడతాడేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,