Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 11:58:43
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా పవన్ ..హెయిర్ స్టైయిల్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన లుక్ పై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కొత్త చిత్రం కోసమే ఇలా నిర్ణయం తీసుకున్నాడు అంటూంటే, అదేం కాదు...ఈ ఒక్క సినిమాకే ఆ హెయిర్ స్టైయిల్ అంటున్నారు. అయితే ఈ రెండూ కాకుండా మరో యాంగిల్ ఒకటి మీడియా సర్కిల్స్ లో కొత్తగా మొదలైంది. వివరాల్లోకి ఆయన తన సినిమా కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసి లుక్ టెస్ట్ నిర్వహించి ఫైనల్ చేయనున్నారు. దానితో పాటు ఈ సినిమాలో పవన్ ..లుంగీతో కనిపించి అలరించనున్నారని చెప్తున్నారు. త్వరలో ఆయన తన పార్టీ జన సేన కోసం జనాలు మధ్యకు వెళ్లాలనుకుంటున్నారని, అందుకే లుక్ నాచురల్ గా ఉంటే తెరమీద, తెర వెనక ఒకేలా ఉంటే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఈ లోగా సినిమాల ద్వారా తన న్యాచురల్ లుక్ ని సాధ్యమైనంతగా జనాలకు అలవాటు చెయ్యాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో ప్రక్క తమిళ స్టార్ అజిత్ ని అనుసరిస్తూ పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాకుండా తమిళ చిత్రం వీరుడొక్కడే ఆధారంగా ఇది రూపొందుతోందని, అక్కడ అజిత్ ఎలా కనపడ్డారో అచ్చం అలాగే ఈ సినిమా లో చేస్తున్నారని చెప్తున్నారు. ఆ సినిమా రైట్స్ నిర్మాత తీసుకోలేదని, దీనిపై వీరమ్ నిర్మాతలు కోర్టుకు వెళ్లే అవకాసం ఉందని ఆ మధ్యన ఓ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రముఖంగా రాసుకొచ్చింది. పవన్ , దర్శకుడు డాలీ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి సిద్దంగా ఉంది. ఈ చిత్రాన్ని ఇంతకు ముందు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య డైరక్ట్ చేయాల్సింది కానీ ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు డాలి అంతకు ముందు రెడీ చేసిన కథ , కథనం లో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా ఓకే చేసాడట. అయితే డైలాగులు మాత్రం కొన్ని మార్చారని తెలుస్తోంది. మరో ప్రక్క సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ గా చేసిన శరద్‌ కేల్కర్...కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈసారి తన పాత్రకి స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని శరద్‌ తెలుగు నేర్చుకొంటున్నారని సమాచారం.

,  ,  ,  ,  ,  ,