Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2016 11:08:04
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఇవాళే. గతేడాది పవన్ పుట్టిన రోజునాడు.. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ గుర్రాన్ని పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న టీజర్ ని విడుదల చేశారు. ఈ సారి కొత్త సినిమా ఖాయమైనా.. ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనక పోవడంతో.. టైటిల్ లోగోని లాంఛ్ చేశాడు నిర్మాత శరత్ మరార్.

పవన్ కొత్త సినిమా పేరు 'కాటమ రాయుడు'. ఈ విషయాన్ని ముందు రోజే ధృవీకరించిన నిర్మాత.. సరిగ్గా పవన్ పుట్టిన రోజు నాడు అర్ధరాత్రి 12 గంటలకు కాటమరాయుడు టైటిల్ లోగోని విడుదల చేశాడు. కోర మీసం పెంచిన పవన్ కొత్తగా కనిపిస్తుంటే.. కాటమరాయుడు టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా అనిపించడం ఖాయం. అత్తారింటికి దారేది మూవీలో పవన్ పాడిన పాట 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా' నుంచే కొత్త సినిమాకి టైటిల్ తీసుకున్నారనే విషయం అర్ధమవుతూనే ఉంది.

టైటిల్ పోస్టర్ లో ఇచ్చిన పవన్ లుక్ ని ఫైనల్ అని చెప్పలేకపోయినా.. సినిమాలో పవన్ ఎలా కనిపించనున్నాడనే క్యూరియాసిటికీ మాత్రం ఓ ఆన్సర్ దొరికేసినట్లే. మరోవైపు.. లెటరింగ్ తోనే కాటమరాయుడు ఎంత పవర్ఫుల్ గా ఉంటాడో చెప్పే ప్రయత్నం చేసింది యూనిట్. టైటిల్ లోగో పోస్టర్ కి అనూప్ రూబెన్స్ ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది.

,  ,  ,  ,  ,