Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 13:07:00
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెలక్షన్స్ పై క్రిటిక్స్ దగ్గరనుండి చాలా సెటైర్లే పడుతున్నాయి. చాలామంది మూవీ లవర్స్ కూడా.. అసలు ఊరూపేరూ లేని దర్శకులతో సినిమాలు ఏంటండీ బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. ఒక ప్రక్కన మహేష్ - చరణ్ - ఎన్టీఆర్ - బన్నీ.. ఇలా స్టార్లందరూ పెద్ద పెద్ద స్టార్ డైరక్టర్లతో చేస్తుంటే.. పవన్ ఏంటి తేడాగా.. అంటూ పెదవి విరుస్తున్నారు.

ఆ విధంగా పవన్ ను విమర్శిస్తున్న వారందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. తొలిప్రేమ తీసినప్పుడు కరుణాకరన్ ఎవరు? ఖుషీ సినిమాకు ముందు ఎవరైనా ఎస్.జె.సూర్య పేరు విన్నారా. బద్రి సినిమాతోనేగా పూరి జగన్ బయటకొచ్చింది. గబ్బర్ సింగ్ టైములో హరీశ్ శంకర్ కు అంత రేంజ్ ఉందేంటండీ? సో పవన్ ఎన్నడూ స్టార్ డైరక్టర్లతోనే పనిచేయడం అంటూ ప్రత్యేకంగా ఏమీ పెట్టుకోలేదు. కొత్త డైరక్టర్లతో సినిమాలు చేసినా కూడా ట్రెండ్ సెట్ చేశాడు. ట్రెండ్ ఫాలో అవ్వలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అందరినీ ఫాలో అవ్వట్లేదు అనుకోవడం కాస్త విడ్డూరమే.

ఇకపోతే పవన్ ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఆల్రెడీ కాటమరాయుడు కథలోనే మాంచి మాస్ పట్టు ఉంది కాబట్టి.. దానిని డాలీ ఖచ్చితంగా పవర్ ఫుల్ గానే తెరకెక్కిస్తాడని అనుకోవచ్చు. ఇక నీసన్ తమిళంలో జిల్లా సినిమాతో దుమ్ములేపేశాడు. కాబట్టి పవన్ తో కూడా అలాంటి పంచ్ కొడతాడని అనుకోవచ్చు. అది సంగతి.

,  ,  ,  ,