Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Feb-2017 15:20:54
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు.. ఎప్పటికప్పుడు తన సెన్సేషన్స్ లెక్కలు ఇప్పుడే మొదలుపెట్టినట్లుగా ఉంది పరిస్థితి. కేవలం 30 సెకండ్ల టీజర్ తో మొత్తం సిట్యుయేషన్ మార్చేశాడు పవన్ కళ్యాణ్. అనేక రకాల అనుమానాల నుంచి.. బోలెడన్ని అంచనాలకు వచ్చేశాడు కాటమరాయుడు.

ఇదంతా టీజర్ లో పవన్ చూపించిన యాక్షన్ మహిమే. అదే టీజర్ ఇప్పుడు.. ఏకంగా మెగాస్టార్ రికార్డును బీట్ చేసేయడం విశేషం. మెగాస్టార్ కం బ్యాక్ మూవీగా అనేక అంచనాల మధ్య వచ్చిన ఖైదీ నంబర్ 150కి.. 77.4 లక్షల వ్యూస్ ఇప్పటివరకూ దక్కాయి. కానీ కాటమరాయుడు మాత్రం ఇప్పటికే ఆ రికార్డు అధిగమించేశాడు. 77.63 లక్షల వ్యూస్.. 2లక్షల లైక్స్ తో కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు కాటమరాయుడు.

ఫ్యాక్షన్ లుక్ లో పవన్ కనిపించడమే ఈ టీజర్ హైలైట్. ఇక తన ట్రేడ్ మార్క్ యాక్షన్ ను పవర్ స్టార్ చూపిస్తే.. ఎలా ఉంటుందనే విషయాన్ని చాటి చెప్పాడు కాటమరాయుడు. బడ్జెట్ లు.. పరిమితులు.. లాంటి సంగతులను పక్కన పెడితే.. ఈ యాక్షన్ మూవీలో పవన్ కళ్యాణ్ తన అభిమానులకు విందు భోజనం వడ్డించనున్నాడనే విషయం మాత్రం వాస్తవం

,  ,  ,  ,  ,  ,