Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 14:10:56
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో బాగా స్లో అనే విషయం చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా పూర్తయ్యాక రెండోది అనౌన్స్ చేసేందుకే బోలెడంత టైమ్ పడుతుంది. అది పూర్తయ్యేందుకు ఎంత టైం పడుతుందో అసలు చెప్పడమే కష్టం. ఇన్నేళ్లూ ఇదే పరిస్థితి కానీ.. ఇప్పుడు స్పీడ్ పెంచాడు పవర్ స్టార్.

ఒకేసారి మూడు ప్రాజెక్టులను డీల్ చేసేస్తోన్నాడు. ఇప్పటికే కాటమరాయుడు మూవీని ఫినిష్ చేసేస్తున్న పవన్ కళ్యాణ్.. త్వరలో త్రివిక్రమ్ తో మూవీ మొదలుపెట్టేయనున్నాడు. మరోవైపు తమిళ దర్శకుడు నేసన్ తెరకెక్కనుండగా.. ఏఎం రత్నం నిర్మించే మూవీ కూడా చేయనున్న పవన్.. ఇప్పుడు మరో సినిమాకి అంగీకరించాడట. కొన్ని నెలల క్రితం పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరికీ అడ్వాన్సులు ముట్టచెప్పింది. కానీ త్రివిక్రమ్-పవన్ సినిమా రాధాకృష్ణ చేతికి వెళ్లిపోయింది. మైత్రీ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడంతో.. పవన్ కు బదులుగా మహేష్ తో మూవీ చేసేందుకు త్రివిక్రమ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మహేష్ 26వ సినిమా ఇదే అంటున్నారు.

మరోవైపు పవన్ దగ్గర మైత్రీ సంస్థది 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఉంది. కమిట్ మెంట్ నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు వీళ్లకు ఓ చిత్రానికి చేసేందుకు అంగీకరించాడట పవన్.

,  ,  ,  ,  ,