Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2015 11:23:03
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్, దాసరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందన్న వార్త రాగానే అది టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇది నిజమేనా? అని డౌటు పడుతున్న వారు కూడా ఇంకా వున్నారు. పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగానే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాసరి అప్పుడే ప్రారంభించినట్టు చెబుతున్నారు. కాగా, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా పవన్ కల్యాణ్ వహిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన 'సత్యాగ్రహి' అనే చిత్రాన్ని ప్రారంభించి, ఆపేసిన సంగతి చాలా మందికి తెలుసు. అది ఆయన డ్రీమ్ ప్రాజక్టు. ఇప్పుడు దానిని బయటకు తీస్తున్నారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే, ఈ చిత్రానికి వచ్చే క్రేజ్ డబుల్ అవుతుందనడంలో సందేహం లేదు!

,  ,  ,  ,  ,