Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Oct-2015 16:29:14
facebook Twitter Googleplus
Photo

ఎవరు పడితే వాళ్లు మీడియాలు పెట్టేసి వార్తల్ని ప్రచారం చేసేస్తున్నారు. మేం కూడా టీవీ చానెళ్లు పెట్టేస్తాం అని దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమాలకు దిగేస్తున్నారు. మీడియాలు పెట్టే స్వేచ్ఛను ఎవరూ హరించరు కానీ ఇలా మీడియాలు పెట్టి జీతాలే సరిగా ఇవ్వని కొన్ని టీవీ చానెళ్లు ఇప్పటికే మూత పడుతున్న వైనాన్ని తెలుసుకోకుండా ఉండకూడదు. అయితే ఇలాంటి మూతపడే చానెళ్లు ఇక నుంచి చూడాల్సిన అవసరం లేనేలేదు. ఒకవేళ స్టార్లకు సంబంధించిన కార్యక్రమాల్ని చూడాలనుకుంటే నేరుగా వారి అధికారిక యూట్యూబ్ చానెళ్లకు వెళ్లి చూడొచ్చు.

యూట్యూబ్ లో హీరో పేరు కొడితే చాలు ఆ చానెళ్లు ఆటోమెటిగ్గా ఓపెన్ అయిపోతాయి. అక్కడ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. ఈ ఐడియాని ఇటీవలి కాలంలో మన సెలబ్రిటీస్ ఫాలో చేస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ అప్పట్లో తన పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. అందులో తనకి సంబంధించిన ప్రతి యాక్టివిటీ చూడొచ్చు. అలాగే మహేష్ తన 40వ పుట్టిన రోజు సందర్భంగా తన పేరుతో ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. మహేస్ సినిమాలకు సంబంధించిన ఆల్ వీడియోస్ ఇందులో చూడొచ్చు.

ఇక తొందర్లోనే పవన్ కల్యాణ్ యూట్యూబ్ చానెల్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే చానెల్ డిజైనర్స్ తో పవన్ సీరియస్ గా మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ సినిమాలతో పాటు ఇతరత్రా .. స్టఫ్ అందుబాటులో ఉంటుంది. పవన్ పై వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్లకు పంచ్ వేస్తూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్ని రూపొందించి ఈ యూట్యూబ్ లో పెడతారని సమాచారం

,  ,  ,  ,  ,