Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Apr-2017 11:29:24
facebook Twitter Googleplus
Photo

గతేడాది భారీ విజయాలు సాదించిన చిత్రాల లిస్ట్ తీసుకుంటే అందులో పెళ్లి చూపులు చిత్ర తప్పకుండా ఉంటుంది. అతి మంచి కథా కథనాలే ప్రధాన బలంగా రూపొందిన ఈ చిత్రం భారీ లాభాల్ని ఆర్జించి పెట్టింది. ఇక ఆ చిత్రాన్ని చేసిన తరుణ్ కు అవార్డు ఖాయమని అందరూ అనుకున్నారు. అందరితో పాటే వాళ్ళు కూడా ఫలితం దక్కుతుందని ఆశించారు.
కానీ తాజాగా జరిగిన రెండు అవార్డు వేడుకల్లో పెళ్లి చూపులకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా దక్కలేదు. కనీసం సినిమా ప్రస్తావన కూడా రాలేదు. దీంతో హర్ట్ అయిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తాను సోషల్ మీడియా ద్వారా కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ అవార్డు వేడుకన్నీ స్టార్ డమ్ ను చూపించుకోవడానికే అని, తాను మాత్రం భవిష్యత్తులో ఇలాంటి స్టార్ డమ్ కు, మార్కెట్ విలువలకు లొంగనని అన్నారు.

,  ,  ,  ,  ,