Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:51:13
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ అభిమానులకు 'రుద్రమదేవి' యూనిట్ సంక్రాంతి కానుకను అందివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పోరాటయోధుడు గోన గన్నారెడ్డి పాత్రను బన్నీ పోషించిన సంగతి విదితమే. ఈ పాత్రకు సంబంధించిన విశేషాలపై అభిమానులు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర మేకింగ్ వీడియోను సంక్రాంతి రోజున రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారు. కాగా, అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,  ,