Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jan-2015 10:41:31
facebook Twitter Googleplus
Photo

'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాల ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చేసుకున్న అందాల సుందరి పూజా హెగ్డే నటించే కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజు మొదలైంది. హిందీలో రూపొందే ఈ చిత్రం పేరు 'మొహంజదారో'. హృతిక్ రోషన్ హీరోగా ఇది రూపొందుతోంది. గతంలో 'లగాన్', 'జోదా అక్బర్' వంటి భారీ చిత్రాలను రూపొందించిన అశుతోష్ గోవారికర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో దీని షూటింగ్ జరుగుతోంది. పోతే, 'ముకుంద' తర్వాత పూజాకు తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే, ఈ బాలీవుడ్ సినిమా వల్ల వేటినీ ఒప్పుకోలేకపోయింది. ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చేసిందట!

,  ,  ,  ,  ,