Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2017 12:36:37
facebook Twitter Googleplus
Photo

దగ్గర హీరోయిన్స్ వయసు దాదాపు 35 దగ్గర నిలిచిపోతుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టం. బాలీవుడ్ లో అయినా కొందరు కనిపిస్తారేమో కానీ.. 40ప్లస్ ఏజ్ వచ్చాక ఒక్కరు కూడా హీరోయిన్ గా కంటిన్యూ కాలేకపోయారు.

కానీ పూజా కుమార్ మాత్రం ఈ ట్రెండ్ కు బ్రేక్ వేసి.. హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. కమల్ విశ్వరూపం వంటి చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను బాగానే అలరించిన పూజా కుమార్.. ఇప్పుడు రాజశేఖర్ నటించిన పీఎస్వీ గరుడవేగ మూవీలో హీరోయిన్ రోల్ లో కనిపించనుంది. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న ఈ చిత్రంలో.. హీరో భార్య స్వాతి పాత్రలో నటించింది పూజా కుమార్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు 120పేజీల స్క్రిప్ట్ తో వచ్చి.. ఆ కథ వివరించినపుడు వెంటనే ఈ కేరక్టర్ చేసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పిందీ 40ఏళ్ల హీరోయిన్.

రియల్ లైఫ్ లో భార్యకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో.. సినిమాలో తన పాత్ర కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందని పూజా కుమార్ అంటోంది. 40 ఏళ్ల వయసులో కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న తొలి బ్యూటీ పూజా కుమార్ అనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,  ,