Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2014 16:52:34
facebook Twitter Googleplus
Photo

కథానాయిక వేషాలు లేని వాళ్లే కాకుండా, కథానాయికలుగా బిజీగా వున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఐటెం సాంగులు చేసేస్తున్న వైనాన్ని మనం చూస్తూనే వున్నాం. అయితే, బిజీ హీరోయిన్లు ఇలాంటి పాటలు చేయాలంటే కాస్త ఎక్కువ తీసుకుంటారు. బిజీ లేని వాళ్ళు మాత్రం తక్కువకి వస్తారు. ఈ క్రమంలో గతంలో కథానాయికగా రాణించిన అందాలభామ పూనం బజ్వా కూడా తాజాగా ఐటెం పాటలకు దిగుతోంది. విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న 'అంబాల' సినిమాలో ఓ ఐటెం పాట చేయడానికి పూనం అంగీకరించింది. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారు.

,  ,  ,  ,  ,