Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2015 10:33:06
facebook Twitter Googleplus
Photo

గతంలో 'బి' గ్రేడ్ హీరోలతో నటించిన మలయాళ భామ పూర్ణ, ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుతో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో మహేష్ తో కలసి ఓ ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పాటను హైదరాబాదు సమీపంలోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన టెంపుల్ సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ అవకాశం వచ్చినందుకు ఈ మల్లూ బేబీ చాలా హ్యాపీగా వుంది. తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో ఈ పాటకోసం ఈ సినిమా యూనిట్ తనను కాంటాక్ట్ చేసిందనీ, మహేష్ బాబుతో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా ఉందనీ పూర్ణ చెప్పింది. కాగా, ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దీనికి 'శ్రీమంతుడు' అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా వుంది.

,  ,  ,  ,  ,  ,