Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jan-2016 14:46:38
facebook Twitter Googleplus
Photo

బి.వి.ఎస్.ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు.. నిన్న సాయంత్రం నుంచి ఇదే హాట్ టాపిక్ టాలీవుడ్ లో. ఇంకే హీరో అయినా నిర్మాత గురించి ఇలా కంప్లైంట్ చేస్తే అది పెద్ద విషయం అయ్యేది కాదు కానీ.. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇలా చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. మానవతా వాదిగా పేరున్న పవన్.. ఓ పెద్ద సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు ఇలా చేయడమేంటో ఎవ్వరికీ అంతు బట్టట్లేదు. ప్రొడ్యూసర్ బాకీ పడితే అడగడంలో తప్పులేదు ఫిర్యాదు చేయడంలోనూ తప్పు లేదు. కానీ అందుకు ఎంచుకున్న టైమింగ్ విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అసలే గత నెల రోజులుగా బి.వి.ఎన్.ప్రసాద్ విపరీతమైన టెన్షన్ అనుభవిస్తున్నారు. ?నాన్నకు ప్రేమతో? సినిమాకు సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ఆయన ఎంత వేదన అనుభవించారో ఆ చిత్ర యూనిట్ సభ్యులకే తెలుసు. రేయింబవళ్లు పని చేయాల్సి వచ్చింది. మరోవైపు బిజినెస్ వ్యవహారాల తలనొప్పీ ఉంది. సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొనడంతో సినిమాకు అయిన బడ్జెట్ కు తగ్గట్లు బిజినెస్ కూడా కాని పరిస్థితి. ఇలా ఎన్నో కష్టాలకు ఓర్చి సినిమాను రిలీజ్ చేశారాయన.

ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు రోజు ఎన్ని టెన్షన్లుంటాయో పవన్ కు కూడా తెలియంది కాదు. బయ్యర్లతో ఎన్నో తలనొప్పులుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కంప్లైంట్ పేరుతో ప్రసాద్ మెడ మీద కత్తి పెట్టడం.. ఆయన్ని మరింత టెన్షన్ కు గురి చేయడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా పవన్ తన డబ్బు వసూలు చేసుకోవాలనుకుంటే.. గట్టిగా అడిగి రాబట్టుకోలేడా? అతనొచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ఫిర్యాదు చేయాలా? ఈ పనేదో ఇంతకుముందే చేయకుండా సరిగ్గా ?నాన్నకు ప్రేమతో? రిలీజ్ కు ముందు రోజే ఇలా చేయడమేంటి? అందుకే ఈ విషయంలో పవన్ విమర్శలెదుర్కొంటున్నాడు.

,  ,  ,