Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 11:24:43
facebook Twitter Googleplus
Photo

యాంకర్ అండ్ హోస్ట్ ప్రభాకర్ కొన్నేళ్ల క్రితం విపరీతంగా ఫేమస్. బుల్లితెర మెగాస్టార్ అని పిలిపించేసుకునే వాడు కూడా. ఈటీవీ ని ఇంటిపేరుగా మార్చేసుకున్న రికార్డు కూడా ఉంది. ఒక దశలో ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే అన్ని కార్యక్రమాల్లోనూ ప్రభాకర్ నేమ్ కార్డ్ ఉండేది. ఆ తర్వాత మెల్లగా సీరియల్స్ లో యాక్టింగ్ ప్రారంభించిన ప్రభాకర్.. కొన్నేళ్ల నుంచి దాదాపు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.

దూరంగా ఉన్నా కానీ.. దూరమైపోలేదు అంటూ.. ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట ప్రభాకర్. ఓ మాంచి మూవీతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇవ్వాలన్నది ప్రభాకర్ టార్గెట్ గా తెలుస్తోంది. నిజానికి తన కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయాలని భావించాడట. అల్లు శిరీష్ హీరోగా ఓ మూవీ చేసేందుకు ఫిక్స్ అయినా.. ప్రస్తుతం శిరీష్ డైరీ ఫుల్ అయిపోవడంతో.. చాలా కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

దీంతో ఆది హీరోగా ఓ మూవీ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకోగా.. మార్చ్ నెలాఖర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ తన హోం బ్యానర్ అని గర్వంగా చెప్పే యూవీ క్రియేషన్స్ పై.. వంశీ.. ప్రమోద్ లు నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుండడం విశేషం. రొమాంటిక్ జోనర్ లో ఉండే ఈ మూవీ తో.. ఆడియన్స్ ను ప్రభాకర్ థ్రిల్ చేయనున్నాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,