ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన వారిలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ స్టైల్ అంటే అందరికి ఇష్టమే. కెరీర్ మొదట్లో సరైన కథలు అందక సతమతమయ్యాడు గాని.. లేకపోతే మొదట్లోనే బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టేవాడు. ఎప్పుడైతే రాజమౌళి చేతుల్లో పడ్డాడో అప్పటి నుండి ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అమ్మాయిలైతే డార్లింగ్ అనడం మొదలు పెట్టేశారు.
ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ దేశమంతటా వ్యాపించింది. ప్రభాస్ గురించి ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు. అంతే కాకుండా అయన నెక్స్ట్ సినిమా గురించి కూడా అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వారిని మారోసారి థ్రిల్ చేయడానికి తన అసలు స్టైల్ ని చూపించడానికి సాహో సినిమా ద్వారా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రభాస్ అభిమానులను థ్రిల్ చేయడానికి ఒక ఫోటో షూట్ నిర్వహించి తన బర్త్ డే కానుకగా కొత్త స్టిల్స్ ఇచ్చాడు.
కొత్త స్టిల్స్ లో రెబల్ స్టార్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. సింపుల్ డ్రెస్ లో స్మైల్ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంటోంది. బర్త్ డే కి అభిమానులకు ఏదైనా ఒక స్పెషల్ ఇవ్వాలనుకొని ఈ విధంగా ఆలోచించి ఉంటాడని అందరు అనుకుంటున్నారు. ఈ నెల 23న ప్రభాస్ 38లోకి అడుగు పెడుతున్నాడు.