అవును.. ప్రభాస్ కొన్ని రోజులుగా నిద్ర పోవడం లేదట. ఈ విషయాన్ని ప్రభాస్ సన్నిహితులే చెబుతున్నారు. అయితే.. ఇది రిలీజ్ కి ముందు సినిమా ఫలితంపై పడే టెన్షన్ కాదు. బాహుబలి2 గ్రాండ్ సక్సెస్ తర్వాత.. ఆ ఆనందంతో పాటు.. వెల్లువెత్తుతున్న అభినందనలే కారణం.
గురువారం రోజు బాహుబలి2 ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అనేక వందలు.. వేల కొద్దీ ఫోన్స్ వస్తున్నాయట. విరామం లేకుండా.. కాల్స్.. మెసేజ్ లతో యంగ్ రెబల్ స్టార్ మొబైల్ మోగుతూనే ఉందని అంటున్నారు. ప్రతీ ఒక్కరూ తెగ ప్రశంసలు గుప్పించేస్తూ.. అసలు విరామం కూడా ఇవ్వడం లేదట. బాహుబలి2 సినిమా విడుదల అయినప్పటి నుంచి ఫ్యామిలీ.. ఫ్రెండ్స్ తోనే గడపుతున్నాడట ప్రభాస్. ఈ సినిమా కోసం నాలుగేళ్లకుపైగా కెరీర్ ను వదులుకుని మరీ కష్టపడ్డాడు ప్రభాస్. బాహుబలి పాత్ర కోసం అహోరాత్రాలు శ్రమించి.. ఇప్పుడు అందుకు తగిన ఫలితం అందుకున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ కు వెల్లువెతుతున్న అభినందనలు.. చుట్టుముడుతున్న సందోహాలను పరిశీలిస్తే.. మరికొన్ని రోజులు నిద్రలేని పగలు రాత్రులు గడపాల్సిందే అంటున్నారు.