Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 13:21:02
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ అయిదేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించాడు. అతడి శ్రమకు ఫలితం దక్కి బాహుబలికి దేశం బ్రహ్మరథం పట్టింది. దాంతో ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు. బాహుబలి తర్వాత రన్ రాజా రన్ ఫేం డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో సాహో సినిమా చేయడానికి ఎప్పుడో పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్టయినా ఇంకా ప్రభాస్ పూర్తిస్థాయిలో షూటింగ్ లో ఇంకా జాయిన్ అవలేదు. త్వరలో యంగ్ రెబల్ స్టార్ రెగ్యులర్ షూటింగ్ కు అటెండ్ కానున్నాడు.

తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సాహో వచ్చే ఏడాది బిగినింగ్ కు థియేటర్లకు వచ్చే అవకాశముంది. దీనితర్వాత ఏం చేయాలనే దానిపై ప్రభాస్ ఓ నిర్ణయానికి వచ్చేశాడు. యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తర్వాత సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దీపావళి నుంచి ప్రారంభం అవుతుంది. అసలు సాహో తర్వాత కరణ్ జోహార్ డైరెక్షన్ లో ప్రభాస్ పూర్తిస్థాయి బాలీవుడ్ చిత్రం చేస్తాడనే టాక్ వినిపించింది. కానీ యువీ క్రియేషన్స్ కే పచ్చజెండా ఊపాడు. ప్రభాస్ కమిటిమెంట్ ఇచ్చిన ఈ రెండు సినిమాల్లో సాహో యాక్షన్ ఎంటర్ టెయినర్ కాగా... రాధాకృష్ణ దర్శకత్వంలో చేసేది పీరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1970-80ల మధ్య యూరప్ బ్యాక్ డ్రాప్ గా నడిచే స్టోరీ అని టాక్.

ప్రభాస్ కు పేరుతో పాటు అమ్మాయిల్లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది డార్లింగ్. తర్వాత అతడు ప్యూర్ లవ్ స్టోరీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి చేస్తుండటం విశేషం. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంతో సాహోను భారీగానే తీస్తున్నారు.

,  ,  ,  ,  ,