Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Jul-2016 14:31:39
facebook Twitter Googleplus
Photo

బాహుబ‌లి?తో ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పాకింది. ఆ మాటకొస్తే బాహుబలి విడుదలైయిన అన్ని దేశాల్లో ప్రభాస్ పేరు మార్మ్రోగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ అంటే బాహుబలి బాహుబలి అంటే ప్రభాస్. ఇప్పుడు అందరికీ ప్రభాసే కావలి. ఆయనతో ఓ సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలే లైన్ లో వున్నారు. బాహుబలి ఫినిష్ చేసిన తర్వాత ప్రబాస్ చేసే సినిమాలు ఏంటి? అనే చర్చ ఎప్పటినుండో జరుగుతుంది.

ఇలాంటి నేపధ్యంలో ప్రభాస్ కాంపౌండ్ నుండి వినిపిస్తున్న ఓ వార్త ప్రబాస్ తో సినిమా తీయాలనుకునే నిర్మాతలకు నిరాశ పరిచినట్లే కనిపిస్తుంది. ఇంతకీ వినిపిస్తున్న ఆ వార్త ఏమిటంటే.. బాహుబలి తర్వాత బయట నిర్మాతలతో సినిమా చేయడానికి ఆసక్తిచూపించడం లేదట ప్రబాస్. కొత్త సినిమా కోసం ఎవరు సంప్రదించినా ?హోం బ్యానర్ తో కమిట్ అయ్యా సార్? అని అని సున్నితంగా సర్ది చెపుతున్నాడట.

ప్రభాస్ హోం బ్యానర్ అంటే ఎదో కాదు. యూవీ క్రియేష‌నే. యూవీ క్రియేష‌న్ కి ప్రభాస్ కు మధ్య వున్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబాలి తర్వాత అదే బ్యానర్ లో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రబాస్.

దీనికి వెనుక గల రీజన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలితో ప్రబాస్ కు మామూలు మార్కెట్ ఏర్పడలేదు. ఇప్పుడా మార్కెట్ వేడిని యూవీ క్రియేష‌న్ కోసం వాడనున్నాడు ప్రభాస్. ఇదీ మేటరు.

,  ,  ,  ,  ,  ,  ,