Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 10:22:09
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి దెబ్బకి బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా అదిరిపోయే హీరోలు ఉన్నారని ప్రభాస్ నిరూపించాడు. నార్త్ మీడియా కూడా ఇప్పుడు టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ చేస్తోందంటే అంతా బాహుబలి వల్లే. ప్రభాస్ హీరోయిజాన్ని రాజమౌళి కరెక్ట్ గా చూపించడంతో దేశమంతటా అభిమానులను సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. బాహుబలితో సంఖ్య మరీ పెరిగిపోయింది. ఇక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరిగిపోతోంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

ప్రభాస్ ఈ మధ్యన సోషల్ మీడియాని కొంచెం బాగానే వాడుతున్నాడు.

,  ,  ,  ,  ,