Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 11:47:50
facebook Twitter Googleplus
Photo

చాలారోజుల తరువాత ప్రభుదేవా తనలోని టాలెంట్ అంతా మళ్లీ ఒకేచోట చూపిస్తున్నాడు. ఈసారి ''అభినేత్రి''తో తనలోని డైరక్టర్ కు బ్రేకిచ్చి.. తనకు లైఫిచ్చిన కొరియోగ్రాఫీలో అలాగే యాక్టింగ్ తో అలరిస్తున్నాడు. ఇన్నాళ్ళూ కేవలం డబ్బుల కోసం కొన్ని ప్రాజెక్టులు చేశానని.. కాని అది తన ఒరిజినల్ క్యారెక్టర్ కాదని అంటున్నాడు ఇండియన్ మైఖేల్ జాక్సన్.

ఇప్పుడు ప్రభుదేవాను ఎవరు కదిపినా కూడా.. ముందుగా వారు ఇతగాడి పర్సనల్ లైఫ్ కు టచ్చేయాలా ఒక ప్రశ్నను అడిగేస్తున్నారు. రామలత్ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుని ఏళ్ళపాటు కాపురం చేసిన ప్రభు.. చివరకు ఆమెకు విడాకులు ఇచ్చేసిన నయనతారతో చెట్టాల్ పట్టాల్ అన్నాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కాని ఘాటు బ్రేకప్పే అయ్యింది. ఆ తరువాత మనోడు యామీ జాక్సన్ ను డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్లు వచ్చాయి కాని.. అందులో పెద్దగా క్లారిటీ లేదు. అసలు మరోసారి పెళ్లి చేసుకుంటావా అని ప్రభును అడిగితే.. ''నా జీవితంలో ఏదీ నేను ఊహించినట్లు జరగలేదు. అందుకే గతంలోకి తొంగిచూడను. అలాగే ఫ్యూచర్ గురించి చెప్పలేను. ఒకవేళ పెళ్ళి అనేది రాసుంటే జరుగుతుంది. లేకపోతే జరగదు'' అంటూ ఫిలాసఫీ చెప్పాడు గురుడు.

అయతే రామలత్ తో డైవర్స్.. తరువాత నయనతారతో ఎఫైర్ అండ్ బ్రేకప్.. ఇవన్నీ ప్రభుదేవాకు తమిళనాట బాగా బ్యాడ్ నేమ్ తెచ్చేశాయి. అందుకే ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఆచితూచి స్పందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,