Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2017 12:22:59
facebook Twitter Googleplus
Photo

ఇంతకుముందు ప్రకాష్ రాజ్ బిజీగా ఉండో.. ఆయన డేట్లు సర్దుబాటు చేయలేకో.. లేక దర్శకుడితో విభేదాలు వచ్చో ఆయన ఏదైనా పాత్ర నుంచి తప్పుకోవడం.. ఆయన ప్లేస్ లోకి మరొకరు రావడం ఉండేది. ఐతే ఈ మధ్య సీన్ రివర్సవుతోంది. ఆయన వేరొకరిని రీప్లేస్ చేస్తున్నారు. ఆ మధ్య గోవిందుడు అందరివాడేలే సినిమాలో రాజ్ కిరణ్ పాత్రను ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేయడం గుర్తుండే ఉంటుంది. సగం పైగా సినిమా అయ్యాక ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. ఆయన కోసం చాలా సన్నివేశాలు రీషూట్ చేశారు. ఇప్పుడు సుకుమార్-రామ్ చరణ్ సినిమా విషయంలోనూ ఇలాగే జరుగుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఆయన కోసం కొత్త పాత్రేమీ సృష్టించలేదు. రావు రమేష్ పాత్రనే ఆయనకు ఇచ్చారట. కారణాలేంటో తెలియలేదు కానీ.. రావు రమేష్ అర్ధంతరంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. ఆయనకు సుకుమార్ తో విభేదాలు తలెత్తాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ఈ మధ్య సినిమాల్లేక ఖాళీగానే ఉండటంతో ఈ పాత్రకు అడగ్గానే ఒప్పేసుకున్నాడట. సుక్కుతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. వీళ్లిద్దరూ ఇంతకుముందు జగడం కోసం కలిసి పని చేశారు. ఇంతకుముందు రావు రమేష్ మీద తీసిన సన్నివేశాల్ని మళ్లీ ప్రకాష్ రాజ్ పై చిత్రీకరించబోతున్నారట.

,  ,  ,  ,  ,