Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 15:14:59
facebook Twitter Googleplus
Photo

మొన్నటి రోజున తేజ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. ఊళ్లను దత్తత తీసుకునేవాళ్లంతా ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులు ఆశించి ఇలా చేస్తున్నారు. ఏదో ప్రజలకు సేవలు చేయడానికి కాదు.. అని ఆయన టెంపర్ ప్రదర్శించారు. మహేష్ రమేష్ శ్రీమంతుడు కార్పొరెట్లు ఎవరైనా కావచ్చు... ఇలా దత్తతల వెనక వేరే కోణం దాగి ఉంది.. అన్న డౌట్ ని తేజ రెయిజ్ చేశాడు. కాని ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి నటులు నైజాం గ్రామాల్ని ఏపీ గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి కారణాలు చెబుతుంటే.. వారు ఏదో డబ్బులు పెట్టట్లేదు.. ఒక సైంటిస్టులాగా సేవ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.

వాస్తవానికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆలోచనలు కాస్త సామాజిక విజ్ఞానం దిశగా సాగుతుంటాయి. కొన్ని ఎతిక్స్ అండ్ వాల్యూస్ ని ఫాలో చేస్తుంటారాయన. నైజాం గ్రామమైన కొండారెడ్డి పల్లెని దత్తత తీసుకోవాలి అని ఆయన గత ఎనిమిది నెలలుగా కసరత్తు చేస్తున్నారు. అంతా పూర్తయ్యాకే ఐటీ గ్రామీణ మంత్రి కేటీఆర్ ని సంప్రదించారు. పల్లెకు వెళ్లి అక్కడ పంటల విధానాన్ని పరిశీలించారు. కొన్ని పొలాల్ని శాంపిల్ గా తీసుకుని నిపుణులతో పరిశోధన చేయించారు. రొటీన్ పద్ధతిలో వ్యవసాయం చేయకుండా రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ పంటలు పండించడం ఎలానో రైతులకు నేర్పించేందుకు రెడీ అవుతున్నారు.

అవసరమైతే రైతులకు ట్రాక్టర్లు కూడా కొనిస్తానని అన్నారు. మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలో చూపిస్తానని అన్నారు. అందుకు పంట పొలాల్ని ఎడాప్ట్ చేసుకున్నానని చెప్పారు. దీనికోసం వ్యవసాయ నిపుణులతో మంతనాలు సాగిస్తున్నాడు. వలంటీర్లను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని వింటున్నారు. మునుముందు కొండారెడ్డి పల్లెనే కాదు... చుట్టు పక్కల గ్రామాలన్నిటినీ దత్తత తీసుకుంటానని చెప్పారు. ప్రజల నుంచి తీసుకున్నది ప్రజలకే ఇచ్చేస్తా .. అని నినాదంతో ముందుకు సాగుతున్నారు. వెల్ డన్ ప్రకాష్!

,  ,  ,  ,