Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:42:06
facebook Twitter Googleplus
Photo

దసరా సందడి సమయం దగ్గర పడుతోంది. ఆశ్చర్యకరంగా ఈసారి ఏకంగా ఐదు సినిమాలు దసరా రేసులో నిలిచాయి. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్నది ప్రేమమ్ సినిమానే అనడంలో సందేహం లేదు. మలయాళ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన ?ప్రేమమ్? సినిమాకు రీమేక్ కావడం ఈ సినిమా మీద మన ప్రేక్షకులకు ఆసక్తి కలగడానికి ఓ ప్రధాన కారణమైతే.. అక్కినేని నాగచైతన్య.. శ్రుతి హాసన్ లాంటి తారలు నటించడం.. చందూ మొండేటి లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం.. ఆ ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలన్నీ కూడా పాజిటివ్ ఫీల్ కలిగించాయి. ఇక రిలీజ్ వీక్ లోకి అడుగు పెట్టేయడంతో ?ప్రేమమ్? టీమ్ ప్రమోషన్ జోరు కూడా పెంచింది. చైతూ ఆల్రెడీ ఇంటర్వ్యూలు మొదలుపెట్టాడు. త్వరలోనే మీడియా వాళ్లందరినీ కలవబోతున్నాడు. చందూతో పాటు మిగతా వాళ్లు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి కొత్త సిల్స్ తో వదులుతున్న పోస్టర్లు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తాజాగా నాగచైతన్య అండ్ గ్యాంగ్ వైట్ అండ్ వైట్లో నడిచి వస్తున్న పోస్టర్ ఒకటి వదిలారు. ఆ మధ్య ?సోగ్గాడే చిన్నినాయనా? రిలీజ్ ముందు నాగార్జున.. చైతూ.. అఖిల్ కలిసి ఇలాగే వైట్ అండ్ వైట్లో ఫొటోలకు పోజులిచ్చారు. దాన్ని తలపిస్తోంది ఈ కొత్త పోస్టర్. ఈ సినిమాలో చైతూ స్నేహితులుగా శ్రీనివాసరెడ్డి.. చైతన్య కృష్ణ.. ప్రవీణ్ నటిస్తున్నారు. వాళ్లు కూడా వైట్ అండ్ వైట్లో రెడీ అయిపోయారు. మలయాళంలో హీరో.. అతడి ఫ్రెండ్స్ లుంగీలేసుకుని కాలేజీకి వస్తారు. ఇక్కడ దాన్ని వైట్ అండ్ వైట్ కు మార్చినట్లున్నారు.

,  ,  ,  ,  ,