Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:21:38
facebook Twitter Googleplus
Photo

ఒకానొక సమయంలో ఇదే మాట కారణంగానే తాను అవకాశాలు పోగొట్టుకున్నానని చెప్పింది పిగ్గీ చాఫ్స్.

టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా.. పలు ఛానల్స్ కు కబుర్లు చెబుతున్న ప్రియాంక చోప్రా.. తను ఈ గ్లామర్ వరల్డ్ రాక ముందు అనుభవాలను కూడా పంచుకుంది. భవిష్యత్తులో ఈ రంగంలోకి వచ్చే మహిళలకు స్ఫూర్తి నింపేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక.. తాను ఎలాంటి తిరస్కారాలను ఎదుర్కొందో వివరంగా చెప్పింది. ఇప్పుడు హాలీవుడ్ లో అవకాశం రాగానే.. నన్ను నేను నిరూపించుకునేందుకు.. నాకు ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకునేందుకు లభించిన అవకాశంగా భావించాను. కాను ఒకప్పుడు నేను మరీ సాంప్రదాయంగా కనిపిస్తున్నానని.. అందుకనే తమ ప్రాజెక్టులో అవకాశం ఇవ్వబోమని నన్ను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు ఇక్కడి వరకూ చేరుకుంది" అని చెప్పింది ప్రియాంక చోప్రా.

క్వాంటికో సీరియల్ తాను లీడ్ రోల్ చేస్తున్నా.. ఆ పాత్రను సృష్టించినపుడు ఓ భారతీయ మహిళ కోసం సృష్టించలేదని.. తాను కూడా ఇండియన్ ఉమన్ ఈ రోల్ లో నటిస్తోందనే వేరియేషన్ కలుగకుండా ఉండేలా జాగ్రత్త పడ్డానని చెప్పింది ప్రియాంక చోప్రా. పీసీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదనే చెప్పాలి.

,  ,  ,  ,