Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2015 12:43:03
facebook Twitter Googleplus
Photo

బంధం దూరం కాకుండా ఉండాలంటే ఆ వ్యక్తులతో రిలీషన్ అనేది ఖచ్ఛితంగా మెయింటెన్ చేయాలి. అప్పుడప్పుడు టచ్ లో ఉంటేనే ఆ రిలేషన్ బాగుంటుంది. లేదంటే ఎవరికి వారే ఎమునా తీరే అన్న చందాన మైండ్ మారిపోతుంది. కొన్ని నెలల నుంచి డిస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇలాంటి సమస్యలనే ఎదుర్కుంటుంది. అమెరికన్ టీవీ సీరియల్ లోక్వాంటికో లో నటించడంతో బాలీవుడ్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది. పాత పరిచయాలన్ని కరుమరుగైపోతున్నాయి. ఇప్పుడు అమెరికాలో హ్యాపీగా ఉన్న తర్వాత ఏమైనా తేడా జరిగితే సీన్ సితార అయిపోతుంది. అందుకే ఇప్పుడు వాళ్లందర్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భోజనం ఏర్పాట్లని తెలుస్తోంది. ?క్వాంటికో?లో నటించడం మొదలుపెట్టాక హిందీ చిత్రం ?బాజీరావ్ మస్తానీ?కి తేదీలు కేటాయించడంలో అమ్మడు తడబడింది.

ముంభై టు అమెరికా అంటూ చక్కెర్లు కొట్టింది. అయినా టీమ్ ఎప్పుడు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు. భారతీయ వనిత అమెరికన్ సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుందని ప్రోత్సహించారు తప్ప విమర్శించలేదు. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తన మనసులో టీమ్ పై ఉన్న ప్రేమను చాటి చెప్పాలనుకుంది. అందుకే షూటింగ్ చివరి రోజున ముంబయ్ లో అందరికీ గ్రాండ్ గా లంచ్ ఏర్పాటు చేసింది. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ కి రెస్టారెంట్స్ ఉన్నాయి.ఇటాలియన్ ఫుడ్ - ఇండియన్ డిషెస్ - చైనీస్... ఇలా రకరకాల డిషెస్ తో రెండు వందల మందికి రిచ్ గా భోజనం పెట్టింది. చివరిగా టీమ్ కృతజ్ఞతలు తెలిపితే ప్రియాంక కంట కన్నీళ్లు చెమర్చాయి. బాలీవుడ్ సినిమాలను కాదని అమెరికా వెళ్లిపోయిందని ఇటీవల విమర్శలు ఎదుర్కుంది. మరి ఈ భోజనం ఏర్పాట్లకు అందరు ప్లాట్ అయిపోయారు కాబట్టి మిగిలిన నోళ్లు మూగబోవడం ఖాయమని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,