Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2017 15:05:10
facebook Twitter Googleplus
Photo

25వ సినిమాతోనే తాను సినిమాలను వదిలేసి.. నిజంగానే యాక్టింగ్ నుండి అజ్ఞాతవాసం తీసుకుంటాడని అనుకుంటే.. ఇప్పుడు మాత్రం మరో కొత్త టాక్ వినిపిస్తోంది. ఒక స్ర్టగ్లింగ్ దర్శకుడితో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాను తీస్తున్నాడని అంటున్నారు. విషయం ఏంటంటే.. మైత్రి మూవీస్ సంస్థ ఇచ్చిన అడ్వాన్స్ ను పవన్ తిరిగిచ్చేస్తున్నాడని టాక్ వినిపించిన కొన్నాళ్ళకే.. ఇప్పుడు వారితో సినిమా చేయడానికి సీక్రెట్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్ వస్తోంది. అది కూడా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో #PSPK26 సినిమా చేస్తున్నాడని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ తో తప్పించి పెద్దగా స్టార్ డైరక్టర్లతో పనిచేయని పవన్.. గతంలో ఓసారి సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథకు ఓకే అన్నాడనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మైత్రి మూవీస్ సంస్థ కొత్తగా ఫిలిం నగర్లో ఒక ఆఫీస్ తెరిచి.. అక్కడ సంతోష్ ఆధ్వర్యంలోని ఒక టీముతో కథను వండిస్తున్నారట. పవన్ ఒక్కసారి అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. ఈ కథను వింటాడట. ఒక్కసారి పవన్ ఓకె అంటే ఇక షూటింగే అంటున్నారు మైత్రి వర్గాలు. ప్రస్తుతానికి ఈ స్టోరీ సిట్టింగ్స్ గురించి ఎవ్వరికీ తెలియకుండా చక్కగా కాపాడే ప్రయత్నం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

,  ,  ,  ,