Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2017 10:05:13
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య బాయోపిక్ అనే పేరు బాగా వినిపిస్తోంది. అయితే మొన్నటి వరకు సావిత్రి - ఎన్టీఆర్ లాంటి మాహా నటుల గురించి చర్చ జరిగితే ఇప్పుడు సరికొత్తగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ చాలా కన్ఫ్యూజన్ కి గురి చేసింది. ఎవరు ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయితే మొత్తంగా నేటితో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజశేఖర్ లాంటి సీనియర్ యాక్టర్ కి లైఫ్ ను ఇచ్చిన ప్రవీణ్ సత్తారు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అవుతున్నాడు. ఇక పుల్లెల గోపీచంద్ రోల్ లో ముందుగా అనుకున్నట్టుగానే సుదీర్ బాబు కనిపించబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యిందనే చెప్పాలి. ఇక సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మరియు అబుదానియా ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు దాదాపు ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఇక డైరెక్ట్ గా మిగతా నటీనటులను సెలెక్ట్ చేసి వచ్చే ఏడాది మే నుండి షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఎంతో గుర్తింపు పొంది ఆ తర్వాత కోచ్ గా మంచి ప్రశంసలను అందుకున్న పుల్లెల గోపీచంద్ స్టోరీలో ఎన్నో మలుపులు ఉంటాయట.

,  ,  ,  ,