Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 17:58:22
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభమైపోయింది. బాలయ్య 101వ సినిమాని మాస్ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందించనున్నారు. ఇలాళే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయినా.. ఇంకా హీరోయిన్ ఎవరనే విషయం అనౌన్స్ చేయలేదు. సినిమా ప్రారంభంతో పాటు ప్రకటిస్తారని అనుకున్నారు కానీ.. అది కూడా జరగలేదు.

నిజానికి ఈ చిత్రం కోసం కొత్త హీరోయిన్ ను తీసుకుందామని భావించాడు పూరీ. కానీ మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం అటు బాలకృష్ణ కానీ.. ఇటు నిర్మాతలు కానీ అంగీకరించలేదు. దీంతో ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో కలిసి నటించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను సంప్రదించాడట పూరీ. అయితే.. ఈ చందమామ మాత్రం వంకలు చెప్పి తప్పుకుందని అంటున్నారు. డేట్స్ విషయంలో పూరీ అడిగినట్లుగా ఇవ్వడానికి షెడ్యూల్ ఖాళీ లేదని చెప్పిందట. రెగ్యులర్ షూటింగ్ వెంటనే ప్రారంభించేయాలనే ఆలోచన పూరీది.

కానీ తను తమిళ్ సినిమాలతో బిజీగా ఉండడంతే.. వెంటనే అయితే ఖాళీ లేదని చెప్పిందట ఈ భామ. గతంలో బాలయ్యతో జత కట్టిన నయనతార.. ఇప్పుడు 3.5 కోట్ల రేంజ్ లో ఉంది.

,  ,  ,  ,  ,  ,