Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Nov-2016 10:23:38
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో శరవేగంగా సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందు చెప్పుకోవాలి. ఏడాదికి కనీసం రెండు రిలీజులుండేలా చూసుకుంటుంటాడు పూరి. గత ఏడాది టెంపర్.. జ్యోతిలక్ష్మీ.. లోఫర్.. ఇలా మూడు సినిమాలొచ్చాయి. ఈ ఏడాది కూడా రెండు సినిమాలు అవగొట్టేశాడు. అందులో ఒకటైన.. ?ఇజం? గత నెలలోనే రిలీజైంది. రెండో సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమానే.. రోగ్. ?ఇజం? కంటే ముందే మొదలైన ఈ సినిమా చాన్నాళ్ల కిందటే పూర్తయినా అనివార్య కారణాల వల్ల రిలీజ్ లేటైంది. ఈ మధ్యే బ్యాంకాక్ వెళ్లి తన కొత్త సినిమా కోసం స్క్రిప్టు రాసుకుని వచ్చిన పూరి.. ?రోగ్?ను విడుదలకు సిద్ధం చేసే పనిలో పడ్డాడు.

కొన్ని రోజులుగా దగ్గరుండి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నాడు పూరి. ఆ పని కూడా దాదాపుగా పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయిందట. డిసెంబర్లోనే మంచి డేట్ చూసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు పూరి. ఈ చిత్రం తెలుగు.. కన్నడ భాషల్లో తెరకెక్కింది. శ్రీకాంత్ తో ?మహాత్మ? సినిమా తీసిన మనోహర్ కొడుకు ఇషాంత్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ఇది. టైటిల్ చూస్తే.. ఇది పూరి మార్కు సినిమాలా కనిపిస్తోంది. అసలే పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు.. పైగా కొత్త హీరో.. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరోవైపు పూరి దీని తర్వాత చేయబోయే సినిమా ఏదన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ తో సినిమా వర్కవుట్ కాకపోవడంతో తన ఓ చిన్న సినిమా చేసి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు పూరి.

,  ,  ,  ,  ,