Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 10:34:43
facebook Twitter Googleplus
Photo

మొన్న సాయంత్రం హీరో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమాలోని సాంగ్ ట్రైలర్ ను విడుదల చేశాడు దర్శకుడు పూరి జగన్. ఈ సందర్భంగా భలే ఇంట్రెస్టింగ్ మాట చెప్పాడు. తాను ఎప్పుడో సంపూర్ణేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉందని.. కాకపోతే అది వర్కవుట్ కాలేదని.. అయితే త్వరలో ఖచ్చితంగా సంపూతో ఒక సినిమా చేస్తానని చెప్పాడు. ఇంతకీ సంపూ హీరోగా పూరి సినిమానా? లేక కమెడియన్ గానా?

నిజానికి పూరి జగన్ సినిమాల రిజల్టుప పుణ్యమా అని.. ఒక బ్యాడ్ టాక్ వచ్చేసింది. మనోడు ఎవరు ఎక్కువగా డబ్బులు ఆఫర్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ కోసం ఒక సినిమా.. అలాగే వారు చెప్పిన హీరోలను దించడానికి ఒక సినిమా.. ఇలా ప్యాకేజ్ కోసమే సినిమాలు చేస్తున్నాడనే బ్యాడ్ నేమ్ మూటకట్టుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా సంపూర్ణేష్ తో సినిమాను తీస్తాను అంటున్నాడు. నిజానికి సినిమా తీస్తే తప్పేం లేదు కాని.. ప్యాకేజ్ సినిమాలా కాకుండా కత్తిలాంటి కథతో ప్యాకేజింగ్ చేసిన సినిమా అయితే.. బాగుంటుందని.. ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ సినిమాను రూపొందిస్తున్నాడు పూరి.

,  ,  ,  ,  ,