దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్లో ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓ సామాజిక అంశం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు ?ఇజం? అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకొని ?ఇజం? సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నిన్న రాత్రి విడుదల చేశారు. హీరో క్యారెక్టరైజేషన్‌ను, లుక్‌ను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించే పూరీ.. మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోలందరినీ తన సినిమాల్లో ఓ కొత్త లుక్‌లో కనిపించేలా చేసి మ్యాజిక్ చేయగా, తాజాగా కళ్యాణ్ రామ్ విషయంలోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేశారు.
నిన్న విడుదలైన ఫస్ట్‌లుక్ చూస్తే కళ్యాణ్ రామ్ లుక్ విషయంలో పూరీ ఎత్త కొత్తదనం చూపించారో అర్థమవుతుంది. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదే బెస్ట్ లుక్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఈ పోస్టర్‌కు అభిమానులు, నెటిజన్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై తెరకెక్కిస్తున్నారు.