Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-May-2017 15:37:43
facebook Twitter Googleplus
Photo

పూరి జగన్నాథ్ ఏ పని చేసినా చకచకా చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఆయన సినిమాలో కథే కాదు... ఆయన సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో సాగిపోతుంది. ఒకప్పుడు ఆయన ఫార్ములా బాగానే వర్కవుటయినా ప్రస్తుతం మాత్రం ఎదురుదెబ్బలే ఎక్కువ తగులుతున్నాయి. రోగ్ అట్టర్ ఫ్లాప్ అవడంతో పూరి పని డైలమాలో పడింది. ఎవరు ఏమనుకున్నా నేనింతే అన్నట్టుండే పూరి ఈసారి నందమూరి బాలకృష్ణతో సినిమా తెరకిక్కించే పనిలో పడ్డాడు.

ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత 101వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాను.. పూరి జగన్ తీస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీయను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్త్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ మరో రెండు మూడు రోజులు షూటింగ్ పూర్తి చేశాక చిత్ర యూనిట్ తర్వాత షెడ్యూల్ లో భాగంగా పోర్చుగల్ బయలుదేరి వెళుతోంది. దాదాపు 40 రోజులపాటు అక్కడ షూటింగ్ కొనసాగనుందట. మూడు పాటలతో పాటు అద్భుతమైన యాక్షన్ సీన్లను అక్కడ చిత్రీకరించనున్నారట. హెలికాప్టర్ లపై స్టంట్ సీన్లను షూట్ చేసేందుకు హాలివుడ్ నుంచి స్టంట్ కో ఆర్డినేటర్ ను తెస్తున్నారట.

బాలయ్య పూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గానే ఉంటుంది. దానితోపాటు పూరి ఆల్రెడీ బాలయ్యది ఒక డాన్ క్యారెక్టర్ అని రివీల్ చేయడం.. ఇప్పుడు పోర్చుగల్ లో హెలికాప్టర్లతో చేజింగ్ అంటుంటే.. మరి హైప్ బాగానే వస్తోంది.

,  ,  ,  ,  ,  ,